మే 10 అక్షయ తృతీయ శుభముహూర్తం! అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు చేసి లక్ష్మీపూజ చేస్తే కలిసొస్తుందని అంతా అనుకుంటారు. మే 10 శుక్రవారం ఉదయం 5.48 నుంది రోజంతా తదియ ఉంది.. కొత్తగా ఏదైనా పని ప్రారంభించేముందు ఆ రోజు తిథి, వారం, నక్షత్రం , వర్జ్యం, దుర్ముహూర్తం చూసుకుంటారు అక్షయ తృతీయ రోజు ఎలాంటి శుభముహూర్తాలు చూసుకోవాల్సిన అవసరం లేదు..రోజంతా అమృత ఘడియలతో సమానమే. శుభ మూహూర్తం చూసుకోవాల్సిన అవసరం లేదు..రోజంతా మంచి ఘడియలే.. ఈ రోజు బంగారం కొనుగోలు చేస్తే అక్షయం అయిపోతుందన్నది ప్రచారం మాత్రమే అక్షయ తృతీయ రోజు దానాలు , పుణ్యకార్యాలు చేస్తే వాటి నుంచి ఫలితం అక్షయం అవుతుందని మాత్రమే పురాణాల్లో ఉంది ఈ ఏడాది అక్షయ తృతీయ శుక్రవారం రావడంతో అమ్మవారి పూజ చేస్తే శుభం జరుగుతుంది Images Credit: Pixabay