తిరుపతి హుండీలో డబ్బులేస్తే పాపాలు పోతాయా! పాపాలు చేసి హుండీలో డబ్బులేస్తే పుణ్యం వచ్చేస్తుందా? కలియుగ ప్రత్యక్షదైవం తిరుమలేశుడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటే పాపాలు పోతాయా? సర్వం తెలిసిన శ్రీవారు ఇలాంటి వారిని ఏమీ చేయరా? పాపం, మోసం , వంచనతో సంపాదించిన ప్రతి రూపాయిపై చేసిన పాపం కూర్చుని ఉంటుంది తలపై ఉండే ప్రతి వెంట్రుకకూ ఆ పాపం అంటుకుని ఉంటుంది అందుకే ముడుపుల రూపంలో కొంత, గుండు చేయించుకోవడం ద్వారా కొంత పాపాన్ని వదిలించుకుంటుంటారు మరి పాపాలు చేసి సంపాదించి మొక్కులు చెల్లిస్తే పాపం పోతుందా అంటే..పోదు.. కానీ ఆ ప్రభావం కొంత తగ్గుతుంది..మిగిలిన ప్రభావం తరతరాలను పట్టిపీడించకమానదు భగవంతుడి దర్శనం ద్వారా కొంతైనా పరివర్తనం వస్తుందనే ఉద్దేశంలో భాగమే మొక్కులు చెల్లించుకునే కాన్సెప్ట్