ఈ నాలుగు వస్తువులు ఎంత పాతబడినా మళ్లీ పూజలో వినియోగించవచ్చు!

Published by: RAMA

పూజ కోసం వివిధ రకాల సామాగ్రి అవసరం.

ఎప్పటికప్పుడు సామగ్రి కొత్తగా కొనుగోలు చేస్తారు..కానీ

ఈ 4 వస్తువులు మాత్రం పాతవి అయినా తిరిగి వినియోగించవచ్చు

స్కాంద పురాణంలో గంగాజలం ఎప్పుడూ పాతబడదని పేర్కొన్నారు

గంగాజలాన్ని ఏళ్ల తరబడి ఇంట్లో ఉంచుకోవచ్చు..తిరిగి దాన్ని శుద్ధికోసం వినియోగించవచ్చు

శివునికి అత్యంత ప్రీతికరమైన బిల్వపత్రం కూడా వాడినా వినియోగించవచ్చు

శివలింగంపై బిల్వపత్రం ఓసారి సమర్పించినా మరోసారి అదే పత్రాన్ని శుద్ధి చేసి వేయొచ్చు

కమలం పువ్వును కూడా ఒకసారి సమర్పించిన తర్వాత మళ్ళీ కడిగి పూజలో పెట్టొచ్చు

తామరపువ్వును ఇలా కడిగి పెడుతూ ఐదు రోజుల వరకూ వాడొచ్చు

తులసి ఆకులను కూడా శుద్ధి చేసి మళ్లీ మళ్లీ పూజకోసం వినియోగించవచ్చు

విష్ణుపూజలో తులసి తప్పనిసరి...కొత్త ఆకులు దొరికితే పర్వాలేదు లేదంటే వాడిన ఆకులు ఉన్నా పూజలో వాడొచ్చు