అన్నీ ఉంటాయ్ కానీ కొందరు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండలేరు
హాయిగా కూర్చునే యోగం ఉన్నప్పటికీ ఏదో ఆందోళనలోనే ఉంటారు
ఇందుకు మూడు కారణాలు ఉన్నాయని చెబుతున్నారు ఆధ్యాత్మికవేత్తలు
1. అజ్ఞానం: అవసరమైనవి వదిలేసి అనవసరమైన విషయాలపై ఆసక్తి పెంచుకుని జ్ఞానవంతులం అనే అజ్ఞానంలో ఉండిపోతారు
2. లోభం : అన్నీ నాకే కావాలి, అన్నీ నా దగ్గరే ఉండాలి, నేనే సంపాదించాలి, నేనే బతకాలి అనుకోవడం
3. భయం : తనకి అనుకున్నది తనదే కానీ అది వేరొకరిది అవుతుందేమో, ఈ రోజు ఉన్నది రేపు లేకుండా పోతుందేమో అనే భయం
అనవసర విషయాలపై తాపత్రయం, అవసరం లేని దగ్గర అధికారం ప్రదర్శన.. ప్రశాంతతని దూరం చేస్తాయి