పిల్లి ఎదురైతే? చైనా వాళ్ల నమ్మకం ఇదే, ఇతర దేశాలు మాత్రం అలా! పిల్లి ఎదురైతే.. మనం అపశకునంగా భావిస్తాం. కీడు జరుగుతుందని అనుకుంటాం. కానీ, ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో వేర్వేరు నమ్మకాలు ఉన్నాయి. ముఖ్యంగా.. ఏ జంతువును వదలకుండా తినేసే చైనావారి నమ్మకాలు చాలా డిఫరెంట్. ఔనండి, పిల్లి ఎదురైతే.. చైనా వాళ్లు గుడ్‌లక్‌గా భావిస్తారు. కొన్ని పాశ్యాత్య దేశాలైతే.. నల్ల పిల్లిని బ్యాడ్‌లక్‌గా భావిస్తారు. నెదర్లాండ్స్ ప్రజలు.. పిల్లి ముందు రహస్యాలను మాట్లాడరు. అది సీక్రెట్లను వినేస్తుందట. పిల్లి తన కాళ్లతో ముఖాన్ని తుడుచుకుంటే చుట్టాలు వస్తున్నారని జపనీస్ భావిస్తారు. ఇటలీలో పిల్లి తుమ్మును అదృష్టంగా భావిస్తారు. బోలెడు డబ్బు వస్తుందని నమ్ముతారు. యూరోపియన్లు మాత్రం నల్ల పిల్లిని చెడు శకునంగా భావిస్తారు. పిల్లి ఒక వ్యక్తి సమాధి మీద నుంచి దూకితే.. ఆ శవం రక్త పిశాచంగా మారుతుందని దక్షిణ ఐరోపా ప్రజల నమ్మకం. పిల్లికి షూలో ఆహారం పెట్టి తినిపిస్తే పెళ్లి అవుతుందనేది పెన్సిల్వేనియా ప్రజల నమ్మకం.