అంటు , నిల్వ దోషం లేని భగవంతుడు మెచ్చే ప్రసాదం ఇది! నిత్యం దీపారాధన చేసేవారు రోజూ ఏదో ఒక నైవేద్యం సమర్పిస్తారు వంట పూర్తిచేసిన తర్వాత మహానైవేద్యం నిత్యం పెట్టేవారున్నారు కొందరు అవసర నైవేద్యంగా పంచదార, పండ్లు సమర్పిస్తారు... అన్నిటికన్నా భగవంతుడికి అత్యంత ప్రత్యేకమైన నైవేద్యం బెల్లం బెల్లానికి అంటు, నిల్వ దోషం అస్సలు ఉండదు భగవంతుడికి బెల్లం నైవేద్యం పెట్టే వారింట అంతా ఆరోగ్యంగా ఉంటారని పండితులు చెబుతున్నారు తూర్పువైపు తిరిగి వంటచేసి ఇంటి యజమానికి అన్నం పెట్టినా... బెల్లం నైవేద్యంగా పెట్టినా మహాపుణ్యం అంటారు అందుకే భగవంతుడికి నివేదించేందుకు ఏమీ లేకపోయినా చిన్న బెల్లంముక్క సమర్పిస్తే చాలు