తిరుమల ఆనందనిలయం వాయువ్య మూలనున్న రహస్యం!



తిరుమల ఆనంద నిలయానికి వాయువ్యమూలన రామానుజచార్యుల విగ్రహం ఉంటుంది



ప్రదక్షిణ చేస్తూ వెనుకవైపు వెళితే నేలకు ఆనుకున్నట్టే కనిపిస్తుంది



ఈ విగ్రహం పెట్టడం వెనుక ఓ కథ ప్రచారంలో ఉంది



12వ శతాబ్దంలో స్వామి విగ్రహం విష్ణుమూర్తిదా, శివుడిదా అనే వివాదం వచ్చింది



దానికి రామానుజాచార్యులు ఓ ఒప్పందం తీసుకొచ్చారు



ఆలయంలో శంఖచక్రాలు పెట్టి రాత్రి ఆలయం మూసేద్దాం



వాటిని తెల్లారేసరికి స్వామివారు ధరిస్తే వేంకటేశ్వరుడే అని అనుకున్నారు



ఆ రోజు రాత్రి ఆదిశేషుడు సర్పరూపంలో తూముద్వారా లోపలకు వెళ్లి శంఖచక్రాలు ధరింపచేశాడట



అందుకు గుర్తుగా ఆదిశేషుడి అంశ అయిన రామానుజుల విగ్రహం ఆ తూముదగ్గర పెట్టారని ప్రచారం
Images Credit: Pinterest