ఉదయాన్నే ఆచరించాల్సిన 6 విధులు

సూర్యోదయానికి ముందు నిద్రలేవాలి
ఈ సమయంలో వాతావరణంలో సానుకూల శక్తి ఉంటుంది. ఈ ముహూర్తంలో నిద్రలేచేవారిలో సానుకూల ఆలోచనలు వస్తాయి.

అరచేతులు చూసుకుని నమస్కరించాలి
కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి
కరమూలే స్థితాగౌరి ప్రభాతే కరదర్శనం

అరచేయి పైభాగనంలో శ్రీ మహాలక్ష్మి, చేయి మధ్యభాగంలో సరస్వతి, క మణికట్టు వద్ద గౌరీదేవి కొలువై ఉంటారు..వారికి నమస్కారం

భూమికి నమస్కారం
సముద్ర వసనే దేవీ పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే

అందర్నీ చల్లగా కాపాడే భూదేవిపై కాలు మోపుతున్నందుకు ముందుకా క్షమాప్రార్థన ఇది... అందుకే భూమికి నమస్కరించి కాలు కింద మోపాలి

సుమంగళ ద్రవ్యాలైన బంగారం, అగ్ని, పాలు, దేవుడి ఫొటో చూసి నమస్కరించాలి

జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరించాలి

భవిష్యత్ ని ఉన్నతంగా తీర్చిదిద్దే గురువుకి నమస్కరించాలి