దేవుడికి పెట్టే తాంబూలంలో ఏమేం ఉండాలి!

పూగీఫలైస్స కర్పూరై ర్నాగవల్లీ దళైర్యుతమ్
ముక్తా చూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్

ఈ శ్లోకాన్ని చదువుతూ తాంబూలం సమర్పయామి అని చెబుతారు

తాంబూలంలో ఏమేం ఉండాలో ఈ శ్లోకంలోనే స్పష్టంగా ఉంది

పూగీ ఫలం అంటే వక్క , కర్పూరం అంటే పచ్చ కర్పూరం

నాగవల్లీ దళం అంటే తమలపాకు..ముక్తా చూర్ణం అంటే సున్నం

ఈ నాలుగింటిని భగవంతుడికి తాంబూలంగా సమర్పించాలి

ఇవేమీ లేకపోతే కొన్ని అక్షతలు తీసుకుని మనస్ఫూర్తిగా నమస్కరించి వేస్తే చాలు

భగవంతుడి ఆరాధనలో విధానం కన్నా భక్తే ప్రధానం...

Images Credit: Pinterest