మధ్యాహ్నం కునుకుతీస్తే సాయంత్రం పూజచేయకూడదా!

లంచ్ తర్వాత నిద్రపోయే అలవాటు చాలామందికి ఉంటుంది

గృహిణులు, వయసుపైబడివారైనా మధ్యాహ్నం కాసేపు విశ్రాంతి తీసుకోవాలి అనుకుంటారు

మధ్యాహ్నం నిద్రపోయి లేస్తే సాయంత్ర పూజచేయకూడదన్న మాటలో నిజం లేదు

రాత్రివేళ నిద్రపోయి లేచిన తర్వాత స్నానమాచరించి పూజ చేస్తారు కదా...

అలానే మధ్యాహ్నం నిద్రపోయినా సాయంత్రం స్నానమాచరించి పూజ చేయొచ్చు

మధ్యాహ్నం నిద్రపోతే ప్రదోష వేళ పూజ పనికిరాదు అని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు

వాస్తవానికి సాయంత్రం సమయంలో కాళ్లు కడుక్కుని కూడా దీపం వెలిగించవచ్చంటారు

అనవసర ప్రచారాలను పరిగణలోకి తీసుకుని భగవంతుడి ఆరాధన మానేయవద్దు
Images Credit: Pinterest