ప్రాధాన్యత
'జీవన వృక్షం'గా ప్రసిద్ధి చెందిన రావిచెట్టుని విష్ణువు నివాసంగా పరిగణిస్తారు. ఈ చెట్టును అమావాస్య రోజు పూజిస్తారు. ఇది హిందూధర్మంలో జ్ఞానం, దీర్ఘాయువును సూచిస్తుంది.
మర్రి చెట్టు శివుడి శాశ్వత నివాసాన్ని సూచిస్తుంది. ఇది అమరత్వానికి ప్రతీకగా పరిగణించబడుతుంది. మహిళలు తమ భర్తల ఆరోగ్యం మరియు దీర్ఘాయువు కోసం వట సావిత్రి వ్రతం సమయంలో దీనిని పూజిస్తారు.
తులసి ఒక పవిత్రమైన మొక్క, లక్ష్మీదేవి అవతారంగా పూజిస్తారు. ఈ మొక్క సంపదను తెస్తుందని ప్రతికూలతను తొలగిస్తుందని నమ్ముతారు.
బిల్వ వృక్షం ఆకులు శివ పూజకు అత్యంత ముఖ్యమైనవి. త్రిదళ ఆకులు బ్రహ్మ, విష్ణు , మహేశ్వరులను సూచిస్తాయి. అవి ఆత్మను శుద్ధి చేస్తాయని పాపాలను నాశనం చేస్తాయని నమ్ముతారు.
ఈ పవిత్ర వృక్షం ప్రేమ , సంతానోత్పత్తికి చిహ్నంగా పరిగణిస్తారు. అశోక వృక్షం దుఃఖాన్ని తొలగిస్తుందని నమ్ముతారు.
అరటి చెట్లు విష్ణువు , లక్ష్మీదేవికి చిహ్నంగా పరిగణిస్తారు. భగవంతుడిని నివేదనకు అయినా, శుభకార్యాల్లో భోజనానికి అయినా ఆకులు వినియోగిస్తారు
వేప చెట్టును దుర్గాదేవిగా పూజిస్తారు. పరిసరాలను శుభ్రపరచడానికి ఉపయోగిస్తారు. ఈ చెట్టు చేదు ఆకులు చెడు ఆత్మల నుంచి రక్షిస్తాయని నమ్ముతారు.
చందనం చెట్టు.. తిలకం, విగ్రహాలు, ధూపం తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఈ పవిత్రమైన చెట్టు పవిత్రత , భక్తితో ముడిపడి . ఇది శ్రీ కృష్ణుడు శివునికి చిహ్నంగా భావిస్తారు
కొబ్బరి చెట్టును తరచుగా 'కల్పవృక్షం' అని పిలుస్తారు. కొబ్బరికాయ కొట్టడం అహం నాశనం , కొత్త ప్రారంభాలకు ప్రతీక.