రామాయణం రంకు భారతం బొంకు అంటే!

రామాయణం మాహాభారతం గురించి మాట్లాడుకున్నప్పుడు ఈ మాట అంటుంటారు

అయితే...ఈ మాట శాస్త్రాల్లో లేదు..కేవలం కొందరు కవులు ప్రస్తావించిన విషయం ఇది

రంకు అంటే నియమాలను అతిక్రమించిన కామ ప్రవర్తన , బొంకు అంటే అసత్యం...

రామాయణం మొత్తం రావణుడి బుద్ది మూలంగా నడిచింది

రావణుడు సీతను ఎత్తుకెళ్లిపోవడం వల్లే యుద్ధం జరిగింది

భారతం మొత్తం దుర్యోధనుడి అబద్థం కారణంగా సాగింది

మయసభలో పడిపోతే ద్రౌపది తనని చూసి నవ్విందని అబద్ధం చెప్పాడు

ఈ నువ్వుకి ప్రతీకారమే ద్రౌపదీవస్త్రాపహరణం..తదనంతరం కురుక్షేత్రం
Images Credit: playground.com