రోజూ కారు, బండి స్టార్ట్ చేసేముందు ఈ శ్లోకం చదువుకోండి!

Published by: RAMA

ఆత్తసజ్జ ధనుర్బాణకరం వృషభవాహనం!
అన్నపూర్ణాసమాశిష్టం పథిషద్రుద్రమాశ్రయే

ప్రయాణంలో రక్షణకు, క్షేమంగా గమ్యాన్ని చేరేందుకు ఈ శ్లోకం పఠించాలి

శ్రీ క్షేమంకర్యై నమః - ప్రయాణ సమయంలో ఇది జపిస్తే క్షేమంగా గమ్యం చేరేలా చేస్తుంది

శ్రీ మార్గబంధవే నమశ్శివాయ - మార్గ మధ్యలో ఎదురయ్యే సమస్యలు తీరిపోతాయి

ఈ రెండు నామాలు వాహనం వెనుక రాసుకోవడం మంచిది

ప్రయాణం ప్రారంభించేటప్పుడు, ప్రయాణంలో ఉన్నప్పుడు, అపాయ మార్గాల్లో ఉన్నప్పుడు పఠించాలి

మానసికంగా జపిస్తే చాలు..బయటకు పెద్దగా చదువుకోవాల్సిన అవసరం లేదు

ప్రయాణం అనేది అనిశ్చితితో నిండినది..ఈ శ్లోకం ద్వారా శివుడి రక్షణ కోరితే ధైర్యం పెరుగుతుంది