భుజంగ్ నాగ్ ఆలయం - గుజరాత్ కచ్ జిల్లా లో ఉన్న ఈ ఆలయం నాగవంశంలో చివరివాడుగా చెప్పే భుజంగ్ కి అంకింత చేశారు. ఇక్కడ నాగపంచమి రోజు పెద్ద జాతర జరుగుతుంది
నాగరాజ ఆలయం - తమిళనాడు కన్యాకుమారి జిల్లా, నాగర్‌కోయిల్‌లో ఉన్న నాగరాజు ఆలయంలో ఐదు తలల పామువిగ్రహానికి పూజలందిస్తారు. ఇక్కడ మట్టిని ప్రసాదంగా ఇస్తారు.
కుక్కే సుబ్రమణ్య దేవాలయం - కర్ణాటక సుబ్రహ్మణ్యస్వామి క్షేత్రాల్లో ఇది అత్యంత విశిష్టమైనది. కాల సర్పదోషం ఉన్నవారు ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు
మన్నరసాల దేవాలయం - కేరళ అలెప్పీ జిల్లాలో ఉన్న ఈ ఆలయ ప్రాంగణంలో దాదాపు 30,000 పాముల రాతి విగ్రహాలుంటాయి. సంతానంకోసం ఈ ఆలయాన్ని సందర్శిస్తారు.
నాగనాథస్వామి ఆలయం - తమిళనాడు కుంభకోణంలోని తిరునాగేశ్వరం గ్రామంలో ఉంది . తక్షకుడు, ఆదిశేషుడు, కర్కోటకుడు ఈ ఆలయంలో శివుడిని పూజించారని పురాణగాథ.
శేషనాగ్ ఆలయం - జమ్మూ & కాశ్మీర్ మన్సార్ సరస్సు ఒడ్డున ఉన్న ఈ ఆలయంలో శేషనాగ్ ఇప్పటికీ ఉన్నాడని భక్తులు నమ్ముతారు. అమర్‌నాథ్ వెళ్లే యాత్రికులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు.
నాగ్‌ద్వార్ - మధ్యప్రదేశ్ సాత్పురా టైగర్ రిజర్వ్ జోన్‌లో ఉన్న ఈ ఆలయాన్ని శ్రావణ మాసంలో పది రోజులు మాత్రమే సందర్శించే వీలుంటుంది.
ఘటి సుబ్రమణ్య - కర్ణాటక బెంగుళూరు నుంచి 60 కి.మీ దూరంలో ఉన్న ఈ ఆలయంలో నరసింహ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలను దర్శించుకోవచ్చు