మారేడు శివుడికే కాదు ఆరోగ్యానికి చాలా మంచిది! నీటిని శుభ్రపరచడంలో మారేడు ఆకులను మించినవి లేవు మారేడు చెట్టు నుంచి వచ్చే గాలి పీల్చడం వల్ల బాహ్య, అంతర కణాలు శుద్ధి అవుతాయి గర్భగుడిలో గాలి సోకదు, సూర్యకిరణాలు ప్రసరించవు అలాంటి వాతావరణంలో మారేడు ఆకులు స్వచ్చతను ఇస్తాయి సూర్యుడిలో ఉండే తేజస్సు మారేడులో ఉంటుంది బిల్వ దళాల్లో తిక్తాను రసం, కషాయ రసం, ఉష్ణ వీర్యం ఉంటాయి....ఇవి.... వాత లక్షణాన్ని తగ్గిస్తాయి, మలినాలను పోగొడతాయి, శ్లేష్మాన్ని, అతిసారాన్ని, గుండె సంబంధమైన వ్యాధులను తగ్గిస్తాయి మారేడు రసాన్ని రాసుకుంటే చర్మ సమస్యలు తగ్గుతాయి, శరీరం నుంచి వచ్చే దుర్గంధం పోతుంది మారేడు చెట్టు వేళ్లనుంచి తీసిన కషాయం మూలశంకను నయం చేస్తుంది ఎండిన మారేడుకాయల్ని ముక్కలు చేసి, కషాయం కాచి తీసుకుంటే జ్వరం తగ్గుతుంది మారేడు వేరునుంచి తీసిన రసాన్ని తేనెతో కలపి తాగితే వాంతులు తగ్గుతాయి మారేడు చెట్టులో అణువణువూ ఔషధ గుణమే...అందుకే ఆరోగ్యానికి కూడా అద్భుతం అంటారు ఆయుర్వేద నిపుణులు Images Credit: Pixabay