వాస్తులో కొన్ని సులభంగా పాటించగలిగే సూచనలు ఉన్నయి. వాటిలో సరైన రంగులో ఉండే పర్స్ వాడడం కూడా ఒకటి. ఎరుపు రంగు శక్తికి, సాహసానికి ప్రతీక. ఈ రంగు పర్సు వాడడం వల్ల ప్రతిష్ట, ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. వాస్తును అనుసరించి నీలం రంగు పర్సు స్థిరత్వానికి చిహ్నం. ఈ రంగు పర్సు వాడితే అన్ని విషయాల్లో సాఫల్యం లభిస్తుంది. పసుపు రంగు పర్సు సంపదకు ప్రతీక. పసుపు రంగు పర్సు వాడడం వల్ల తరగని సంపద లభిస్తుంది. వాస్తు ప్రకారం నలుపు రంగు పర్సు వాడితే వృత్తి ఉద్యోగాల్లో విజయాలు ప్రాప్తిస్తాయి. ధనం చేకూరుతుంది. ఆకుపచ్చ రంగు పర్సు వాడే వారికి సర్వదా విజయం లభిస్తుంది. ఆకుపచ్చ రంగు పాజిటివిటికి సంకేతం. ఆరెంజ్ రంగు పర్సు వాడితే సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. పర్సు కోనే సమయంలో ఒక పాజిటివ్ దృక్పథంతో కొనాలి. కచ్చితంగా ఏ రంగు పర్సు కొంటున్నమనేది గుర్తుంచుకోవాలి. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే