పెళ్లిలో వధూవరులకు నక్షత్రం ఎందుకు చూపిస్తారు!

అరుంధత్యనసూయా చ సావిత్రీ జానకీసతీ
తేజస్వనీ చ పాంచాలీ వందనీయ నిరంతరం!!

అరుంధతీ, అనసూయ, సావిత్రి, సీత, ద్రౌపది. ఈ మహాపతివ్రతల్లో అరుంధతి అగ్రగామి , అగ్నినుంచి ఉద్భవించినది.

బ్రహ్మదేవుని కుమార్తె పేరు సంధ్యాదేవి. తనకు ఉపదేశం చేసే బ్రహ్మచారి కోసం వెతుకుతూ వశిష్ఠుడిని ఆశ్రయించింది

ఉపదేశం తర్వాత సంధ్యాదేవి అగ్నిలో దిగి ఆహుతై..అందులోంచి మళ్లీ అందమైన స్త్రీరూపం ఉద్భవించింది..ఆమె అరుంధతి

అరుంధతి తన సౌభాగ్య, పాతివ్రత్య దీక్షతో నక్షత్ర రూపంలో ఆకాశంలో చిరస్థాయిగా వెలుగుతోంది

పెళ్లిలో మూడుముళ్లు వేసిన తర్వాత..వధూవరులను తీసుకెళ్లి అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు

ఆ బంధం అరుంధతి, వశిష్ఠుడిలా కలకాలం వెలగాలని దీవిస్తారు

వధువు...అరుంధతిలా సహనం, శాంతం, ఓర్పు, పాతివ్రత్య లక్షణాలు కలగి ఉండాలని ఆంతర్యం

అరుంధతి వశిష్ఠుల తనయుడు శక్తి...ఆయన కుమారుడు పరాశరుడు..పరాశరుడి కుమారుడే వ్యాసమహర్షి

అంత గొప్ప వంశాన్ని అందించింది అరుంధతి..అందుకే ఆమె దర్శనం దాంపత్యానికి వరం
Image Credit: playground.com