హోలీ 2024: నూతన దంపతులు హోలికా దహనం చూడకూడదా! ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజు హోలీ జరుపుకుంటారు...దీనినే కాముని పున్నమి, డోలికోత్సవం అని అంటారు పౌర్ణమి రోజు రాత్రి చాలా ప్రాంతాల్లో హోలికా దహనం చేస్తారు హోలికా దహనం వల్ల చెడు బూడిదై మంచి జరుగుతుందంటారు కానీ.. ఈ హోలికా దహనాన్ని నూతన దంపతులు చూడకూడదని చెబుతారు ఎందుకంటే హోళికా దహనం అంటే శరీరం అగ్నిలో కాలుతుంది కదా..అంటే శవదహనం అని అర్థం కొత్తగా పెళ్లైన వాళ్లు శవదహనంతో సమానమైన హోలికా దహనం చూస్తే వారి జీవితంలో బాధలు వెంటాడతాయంటారు. శివుడిపై పూల బాణాన్ని ప్రయోగించి మన్మథుడు భస్మమైన రోజునే కామదహనం జరుపుకుంటారు పౌర్ణమి ముందు వచ్చే చతుర్థశి రోజు కామదహనం చేసి ఆ తర్వాత రోజు హోలీ జరుపుకుంటారు Image Credit: Pinterest