గుడి మెట్లు తాకి నమస్కరించడం వెనుకున్న ఆధ్యాత్మిక రహస్యం ఏంటి?

Published by: RAMA

దేవాలయం ఆధ్యాత్మిక శక్తికి కేంద్రంగా పరిగణిస్తారు

ఆలయ శిఖరం దేవతల దివ్య స్వరూపం అని ..మెట్లు దేవుని పాదాలకు ప్రతీకగా భావిస్తారు

మెట్లను తాకి నమస్కరించడం దేవత పట్ల గౌరవాన్ని వ్యక్తపరచడంలో భాగం

గుడిలోకి ప్రవేశించే ముందు వంగి నమస్కరించడం అహంకారం తగ్గించుకుని వినయాన్ని ప్రదర్శించడమే

మెట్లకు వంగి నమస్కరించడం వల్ల భక్తి, శ్రద్ధ పెరిగి..మనలో ప్రతికూల శక్తి మాయమవుతుందని నమ్మకం

సనాతన సంస్కృతిలో శతాబ్దాలుగా ఆచరిస్తున్న విధానం ఇది

కారణం తెలిసినా తెలియకపోయినా..ఆలయంలో అడుగుపెట్టగానే అప్రయత్నంగా మెట్లకు నమస్కరిస్తారు భక్తులు..