పాలవెల్లి ఎందుకు కడతారు!
అనంతవిశ్వంలో అణువంత భూమి..భూమ్మీద నిల్చుని చూస్తే నక్షత్రాలు పాలసముద్రంలా ఉంటాయి..వాటిని పాలవెల్లి అంటారు..
గణపతి పూజ అంటే ప్రకృతి ఆరాధన..అందుకే ప్రకృతిలో దొరికే ఆకులు, పండ్లుతోనే పూజ చేస్తారు
ప్రకృతిలో సృష్టి, స్థితి, లయం అనే మూడు స్థితులుంటాయి..ఈ మూడింటిని సూచిస్తూ గణపతి పూజకు అలంకరణ చేస్తారు
భూమికి సూచనగా మట్టి ప్రతిమ, జీవాన్ని సూచనగా పత్రి, ఆకాశానికి సూచనగా పాలవెల్లి కడతారు..
గణాలకు అధిపతి అయిన గణపతిని పూజిస్తే ముక్కోటి దేవతలను కొలిచినట్టే..ఆ దేవతలకు సూచనగా పాలవెల్లి కట్టాలి
నక్షత్రాలకు గుర్తుగా..పాలవెల్లి నిండుగా మొక్కజొన్న, జామ, వెలగ లాంటి పండ్లతో అలంకరణ చేస్తారు
వినాయక పూజ అంటే ఆడంబరంగా జరిగే క్రతువుకాదు.. సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే వాటితో చేసే క్రతువు
అందుకే ఏమీ లేకపోయినా కానీ మట్టితో వినాయకుడిని చేసి గరికతో పూజ చేసి.. బెల్లం నైవేద్యంగా సమర్పించినా గణపయ్య దిగొచ్చేస్తాడు..