వినాయకచవితి పూజా ముహూర్తం ఇదే!
2024 సెప్టెంబరు 07 శనివారం వినాయక చవితి
సెప్టెంబరు 06 శుక్రవారం మధ్యాహ్నం మొదలైన చవితి ఘడియలు..సెప్టెంబరు 07 శనివారం మధ్యాహ్నం 1.50 వరకూ ఉన్నాయి
చవితి తిథి సూర్యోదయానికి ప్రధానం కాబట్టి ఇంట్లో వినాయక పూజ సెప్టెంబరు 07 శనివారం జరుపుకుంటారు
గణపతి నవరాత్రులు ప్రారంభమయ్యేది కూడా సెప్టెంబరు 07 శనివారం నుంచి...
సూర్యోదయం 5.49... సూర్యాస్తమయం 6.07
దుర్ముహూర్తం సూర్యోదయం నుంచి ఉదయం 7 గంటల 27 నిముషాల వరకు ఉంది
వర్జ్యం - సెప్టెంబరు 07 సాయంత్రం 4.35 నుంచి 6.20 వరకు ఉంది
ఉదయం ఏడున్నర దాటిన తర్వాత మధ్యాహ్నం చవితి ఘడియలు ముగిసే 2 గంటల లోపు ఎప్పుడైనా పూజ చేసుకోవచ్చు..