వినాయకచవితి 2024: దేశంలో టాప్ 10 వినాయక ఆలయాలు!
కాణిపాకం
కాణిపాకంలో వెలసిన వినాయకుడు సత్యప్రమాణానలకు నెలవు. తిరుమల వెళ్లిన భక్తులంతా కాణిపాకం స్వామివారిని దర్శించుకుంటారు
సిద్ధి వినాయక దేవాలయం
ముంబైలో ఉన్న ప్రముఖ ఆలయాల్లో సిద్ధి వినాయక దేవాలయం ఒకటి. ఇక్కడ గణేషుడి అష్టరూపాలను దర్శించుకోవచ్చు. గణేష్ చతుర్థి ఉత్సవాలు ఇక్కడ అత్యంత వైభవంగా జరుగుతాయి.
మనకుల వినాయగర్ దేవాలయం
పుదుచ్చేరి లో ఉన్న ఈ ఆలయం బ్రిటీష్ వారి దండయాత్రల నుంచి బయపడి నిలిచింది. బీచ్ రోడ్ కి సమీపంలో ఉండే ఈ గణనాథుడి ఆలయం నిత్యం భక్తులతో కళకళలాడిపోతుంది.
కురుడుమలై శక్తి గణపతి
బెంగళూరు సమీపం కోలూరు జిల్లాలో కొలువైన కురుడుమలై శక్తి గణపతి ఆలయంలో వినాయకుడిని త్రిమూర్తులు ప్రతిష్టించారని చెబుతారు. ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.
త్రినేత్ర దేవాలయం
రాజస్థాన్ రణతంబోర్‌లో ఉన్న త్రినేత్ర దేవాలయం దేశంలోనే అత్యంత పురాతన ఆలయంగా చెబుతారు. ఇక్కడ గణనాథుడు తన కుటుంబంతో సహా కొలువయ్యాడు. వినాయకుడు త్రినేత్రుడిగా భక్తులకు దర్శనమిచ్చే ఏకైక ఆలయం ఇదే..
చింతమన్ గణేష్ ఆలయం
ఉజ్జయినిలో ఉన్న మహాకేళేశ్వరుడి ఆలయంలోనే కొలువయ్యాడు చింతమన్ గణేషుడు. రుద్రుడిని దర్శించుకునేముందే చింతమన్ గణేషుడిని దర్శించుకుంటే చింతలు తీరిపోతాయని భక్తుల విశ్వాసం.
గణేష్ టోక్ టెంపుల్
గ్యాంగ్ టక్ లో ఉన్న గణేష్ టోక్ ఆలయం మార్గం మొత్తం జెండాలతో నిండి ఇంద్ర ధనస్సులా ఉంటుంది. ఇక్కడ లంబోదరుడిని దర్శించుకుంటే చేపట్టిన పనుల్లో విజయం తథ్యం అని భావిస్తారు.
గణపతి పూలే ఆలయం
మహారాష్ట్ర రత్నగిరి జిల్లా సముద్రతీరంలో ఉంటుంది గణపతి పూలే ఆలయం. అగస్త్య మహర్షి ఈ విగ్రహాన్ని ప్రతిష్టించారని చెబుతారు. వినాయక నవరాత్రులు కన్నులపండువగా జరుగుతాయిక్కడ..
మోతీ డుంగ్రీ
రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఉన్న మోతీ డుంగ్రీ ఆలయానికి 500 ఏళ్ల చరిత్ర ఉంది. బిర్లామందిర్ పక్కనే ఈ ఆలయం ఉంటుంది. గణపతి నవరాత్రులు వేడుకగా జరుగుతాయి ఇక్కడ
దగ్దుషేత్ హల్వాయి గణపతి
ప్లేగు వ్యాధితో తన కుమారుడు మరణిస్తే...ఓ స్వీట్స్ వ్యాపారి నిర్మించిన ఆలయం దగ్ధుషేక్ హల్వాయి గణపతి. బంగారు ఆభరణాలతో కళకళలాడే ఇక్కడ పార్వతీ తనయుడిని దర్శించుకోవడం పూణే వెళ్లినవారు అస్సలు మిస్సవకండి