ప్రశాంతమైన జీవితం కోసం మీరు వదిలించుకోవాల్సిన 10 విషపూరితమైన అలవాట్లు
చేయాల్సిన పనిలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఫలితం ఎలా ఉన్నా మీ కర్మను ఆచరించడంలోనే ఆత్మసంతృప్తి ఉంటుంది. ఇలాంటి మనస్తత్వాన్ని అధిగమించాలంటే క్రమశిక్షణ , దృఢ నిశ్చయం అవసరం.
కొన్నిసార్లు ఒంటరిగా ఉండటం మంచిదని భావిస్తారు, ఎందుకంటే అది వారికి ఎక్కువ స్వాంతన కలిగిస్తుంది. అయితే ఒంటరితనానికి, ఏకాాంతానికి వ్యత్యాసం ఉంటుంది. అది తెలుసుకుని ఒంటరితనాన్ని దాటి రావాలి
నిరాశావాదాన్ని అధిగమించడానికి ఆశావాద, వాస్తవిక వ్యక్తులతో సమయం వెచ్చిచండి. స్ఫూర్తిదాయకమైన పుస్తకాలు చదవండి , ధ్యాన సాధన చేయండి. శరీరం, మనస్సుని ఉత్తేజపరిచే ఆహారాన్ని తీసుకోండి
లక్ష్యం నుంచి మనం పక్కకు మళ్ళీ బాహ్య అంశాలను పరిష్కరించడంపై దృష్టి పెడతాం. మార్పును మనం స్వీకరించాలి..ముందు మనం మారాలి..మనకోసం ప్రపంచం మారదని అర్థం చేసుకోవాలి
మనకు పేరు, కీర్తి, ప్రశంసలు , విజయం లభించినప్పుడు మన ప్రయాణం పూర్తయిందని భావిస్తాం. కచ్చితంగా ఇది అహంకారమే అవుతుంది. నిజాయితీగా సేవ చేయడం ద్వారా అహంకారాన్ని జయించవచ్చు.
మనం ఇతరులతో పోల్చుకోకుండా మన జీవిత ప్రయాణాన్ని అంగీకరించాలి. ఆధ్యాత్మిక జ్ఞానం .. ఆ జ్ఞానాన్ని దైనందిన జీవితంలో ఉపయోగించడం ద్వారా సందేహాలను అధిగమించవచ్చు.
చంచలమైన ఆలోచనలు మనల్ని కదిలిస్తాయి. మనం ఆధ్యాత్మికంగా బలహీనంగా ఉంటే ప్రపంచంలోని ప్రలోభాలకు సులభంగా ప్రభావితమవుతాము. ధ్యానం చేయడం ద్వారా సందిగ్ధత అధిగమించగలం
భయం సందేహాలను , సందిగ్ధతను మరింత పెంచుతుంది... తద్వారా ప్రక్రియలో ఆశ కోల్పోతారు. మన జీవితాల్లో సంఘటనలను మన ప్రయోజనం కోసం, అవి ఎంత అస్పష్టంగా ఉన్నా, నిర్వహించడానికి దైవిక శక్తి అవసరం అని గుర్తించాలి
భగవద్గీతలో కోపం నుంచి సంపూర్ణ భ్రాంతి కలుగుతుందని, భ్రాంతి నుంచి జ్ఞాపకశక్తి గందరగోళానికి గురవుతుందని ఉంది. కోరికలను శుద్ధి చేసుకోవడం ద్వారా, వాస్తవికతను కృపతో స్వీకరించడం ద్వారా కోపాన్ని జయించవచ్చు.
ఇంద్రియాలను తృప్తి పరచుకోవాలనే కోరికను కామం అంటారు. నెరవేరని కామం కోపంగా మారుతుంది, నెరవేరిన కామం లోభంగా మారుతుంది. కోరికలను అదుపులో ఉంచుకోవడం, ఆకర్షణీయమైన పరిస్థితులను నివారించడం అవసరం