సూర్యాస్తమయం సమయంలో ఏ పనులు చేయకూడదు హిందూమత గ్రంధాల ప్రకారం సాయంత్రం కొన్ని పనులు చేయకూడదు . సూర్యాస్తమయం తర్వాత ఈపనులు చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుందని శాస్త్రంచెబుతోంది. సూర్యాస్తమయం తర్వాత ఎలాంటి పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. సూర్యాస్తమయం తర్వాత ఇంటిని ఊడ్చకూడదు. ఈ సమయంలో ఇల్లు ఊడ్చితే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. సంధ్యాసమయంలో ఎవరికీ డబ్బు ఇవ్వకూడదు. ఈ సమయంలో డబ్బు ఇస్తే తిరిగి రాదు. సాయంత్రం గోర్లు కత్తిరించడం నిషేదం.కుటుంబం అప్పులపాలవుతుందని శాస్త్రం చెబుతోంది. సాయంత్రం జుట్టు కత్తిరిస్తే ఇంట్లోకి ప్రతికూల శక్తులు వస్తాయి. లక్ష్మీదేవి కోపంతో రగిలిపోతుంది. సూర్యాస్తమయం తర్వాత బట్టలు ఉతకూడదు. వాస్తు ప్రకారం ఇలా చేస్తే ప్రతికూల శక్తి వస్తుంది. సంధ్యాసమయంలో నిద్రించడం అస్సలు మంచిదికాదు. ఎందుకంటే ఆ సమయంలో లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. సాయంత్రం తులసికి నీరు పోయకూడదు. తులసి ఆకులను తెంపకూడదు. ఇలా చేస్తే ఇంట్లో ఆర్థిక సమస్యలు మొదలవుతాయి.