చాణక్య నీతి: ఈ 3 విషయాల్లో నిర్లక్ష్యం తగదు

ఏ సమస్య వచ్చినప్పుడు ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలో చాణక్యుడు నీతిశాస్త్రంలో చెప్పాడు

ముఖ్యంగా 3 విషయాల్లో నిర్లక్ష్యంగా ఉండకుండా ఉంటే చాలు సమస్యలకు దూరంగా ఉన్నట్టే

మొదటిది అనారోగ్యం
రెండోది శత్రువులు
మూడోది పాములు ( విష మనస్తత్వం ఉన్నవారు)

ఈ మూడు సమయం కోసం ఎదురుచూసేవే..ఒక్కసారి వాటి చేతికి చిక్కితే వదిలిపెట్టవు

ఆరోగ్యం విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా వ్యాధులు తప్పవు..ఒక్కోసారి ప్రాణాలకే ప్రమాదం రావొచ్చు

శత్రువు సైలెంట్ గా ఉన్నాడని బలహీనుడు అని మీరు నిర్లక్ష్యంగా ఉంటే మీ పనైపోయినట్టే

ఓడినవారు ఎప్పుడూ నిశ్చబ్ధంగా ఉండరు..అవకాశం కోసం పొంచి ఉంటారని గుర్తుంచుకోవాలి

పాములు కూడా అంతే ..ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలియకుండా చటుక్కున కాటేసి వెళ్లిపోతాయి

అందుకే ఈ మూడు విషయాల్లో నిర్లక్ష్యంగా ఉండకూడదంటాడు ఆచార్య చాణక్యుడు
Image Credit: playground.com