అందరి ప్రాణాలు తీసే యముడికి మరణం లేదా! అందరి ప్రాణాలు యమధర్మరాజు తీస్తాడు.. యముడి మాట వింటనే భయపడిపోతారు కానీ యముడికి మరణం లేదా అనే సందేహం చాలా మందిలో ఉంది... యముడు మరణించి మళ్లీ బతికాడని మీకు తెలుసా? మార్కండేయుడి ఆయువు తీరినప్పుడు ఆ ప్రాణం తీసుకెళ్లేందుకు వచ్చాడు యముడు నేను పరమేశ్వరుడిని పట్టుకుని ఉండగా నా ప్రాణం ఎలా తీసుకెళ్లిపోతావ్ అన్నాడు మార్కండేయుడు నేను ఏమీ చేయలేనా అంటూ పాశం విసిరాడు యముడు యమపాశం..మార్కండేయుడితో పాటూ శివలింగానికి కూడా చుట్టుకుంది ఆగ్రహంతో అక్కడ ప్రత్యక్షమైన శివుడు..యముడి వక్షస్థలంపై తన్నడంతో మరణించాడు దేవతలంతా వచ్చి శివుడిని శాంతింపచేయడంతో అప్పుడు యముడు మళ్లీ బతికాడు భక్తి శ్రద్ధలతో శివారాధన చేస్తే మృత్యుభయం తొలగిపోతుందనడం వెనుకున్న ఆంతర్యం ఇదే Image Credit: Pixabay