చాణక్య నీతి: భూ ప్రపంచంలో ఉన్నవి మూడే ఆభరణాలు

ఆభరణాలు అనగానే బంగారం, వజ్రాలు, వైఢూర్యాలు అనుకుంటారంతా..కానీ ఆచార్య చాణక్యుడి వ్యూ వేరు...

భూ ప్రపంచంలో ఉన్నవి కేవలం మూడే ఆభరణాలు అని స్పష్టం చేసిన చాణక్యుడు..అవేంటో స్ఫష్టంగా వివరించారు

ఆ మూడు ఆభరణాలు.. 1.నీరు 2.ఆహారధాన్యాలు 3.జ్ఞానంతో నిండిన పలుకులు..

మూర్ఖులంతా చిన్న చిన్న రాళ్ల ముక్కలను పట్టుకుని అవే ఆభరణాలు అనుకుంటారు..వాటితోనే స్థాయిని నిర్ణయిస్తారు

చాణక్యుడి దృష్టిలో రాళ్లముక్కలు అంటే వజ్రం, వైఢూర్యం, కెంపు, ముత్యం, పగడం లాంటివి అని ఆంతర్యం...

నీరు మనిషికి జీవనాధారం..నీరు లేని ప్రదేశంలో అభివృద్ధి సాధ్యం కాదు..ప్రజలు సుఖసంతోషాలతో నివసించలేరు

ఆహారధాన్యాలు అందుబాటులో లేకపోతే ఆకలిచావులు మొదలవుతాయి..అది దేశాభివృద్ధికి అస్సలు మంచిది కాదు

సజ్జనులు, జ్ఞానాన్ని పంచేవారు లేకపోతే అరాచకం రాజ్యమేలుతుంది...

అందుకే భూమ్మీద ఈ మూడు మాత్రమే అత్యంత విలువైన ఆభరణాలు అన్నది చాణక్యుడి ఉద్దేశం