ఈ వైపు తిరిగి భోజనం చేస్తే కోర్కెలు ఫలిస్తాయి



భోజనం ఎలా చేయాలి, ఎలా వడ్డించాలి, ఎలా తినాలి, ఎలా వండాలి అనే ప్రతి విషయాన్ని నియమ నిబంధనల ప్రకారం చెప్పారు పెద్దలు.



రోజుకి రెండుసార్లు భోజనం చేయాలని తైత్తరీయ బ్రాహ్మణం సెలవిస్తోంది.



రెండుసార్ల మధ్యలో ఇంకేమీ తినకుండా ఉంటే ఉపవాస ఫలితం కూడా వస్తుందట



భోజనం చేసేటప్పుడు తూర్పువైపు తిరిగి భోజనం చేయాలి



తూర్పువైపు తిరిగి భోజనం చేస్తే ఆయుష్షు



దక్షిణం వైపు తిరిగి భోజనం చేస్తే కీర్తి



ఉత్తరం వైపు తిరిగి భోజనం చేస్తే కోరికలు ఫలిస్తాయి



పడమర, దక్షిణం వైపు తిరిగి భోజనం చేయరాదని వామనపురాణం, విష్ణుపురాణంలో ఉంది



తూర్పు తిరిగి భోజనం చేయడం అనేది అన్ని శాస్త్రాలు, ధర్మాలు ఏకగ్రీవంగా చెబుతున్నాయి



మను సంహిత ప్రకారం కుటుంబ పెద్ద తూర్పు ముఖంగా కూర్చుని భోజనం చేయాలి



భోజనానికి ముందు,తర్వాత కాళ్ళు, చేతులు కడుక్కోవాలి. తడికాళ్ళను తుడుచుకుని భోజనానికి కూర్చోవాలి.
(Images Credit: Pinterest)