కొవ్వు కరిగించే క్యారెట్



కొలెస్ట్రాల్ శరీరంలో సైలెంట్‌గా చేరిపోతుంది.

పొట్ట చుట్టూ చేరుకుపోయి కొవ్వు పట్టి చాలా వ్యాధులకు కారణమవుతుంది.

కొలెస్ట్రాల్‌ను కరిగించే కూరగాయ క్యారెట్.

రోజుకో క్యారెట్ ఉదయం, సాయంత్రం తినడం అలవాటు చేసుకుంటే చాలా మంచిది.

క్యారెట్లో ఖనిజాలు, విటమిన్లు, కరిగే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించేందుకు ఉపయోగపడతాయి.

ఇందులో బీటా కెరాటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ అధికంగా లభిస్తుంది. ఇది గుండె సంబంధ వ్యాధుల నుంచి కాపాడడంలో ముందుంటుంది.

క్యారెట్లో కరగని, కరిగే రెండు రకాల ఫైబర్ ఉంటుంది. ఇవి రెండూ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.

రక్తపోటును, రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడంలో సహాయపడతాయి.