మే 21 శనివారం రాశిఫలాలు



మేషం
ఈ రోజు మీరు కొన్ని ముఖ్యమైన పనుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొత్త భాగస్వాములు వ్యాపారంలో చేరుతారు. ధార్మిక యాత్రలో వచ్చిన అడ్డంకులు తొలగిపోతాయి. సలహాలు ఇవ్వడంపై శ్రద్ధ తగ్గించండి. వైవాహిక సంబంధాల్లో ఒత్తిడులు తొలగిపోతాయి.



వృషభం
ఈ రోజంతా ఆహ్లాదకరంగా ఉంటుంది. కుటుంబంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు పరిష్కారం అవుతాయి.ఉన్నతాధికారుల అండ మీకుంటుంది.ఏదో విషయం గురించి ఆలోచిస్తారు. మానసికంగా ఏదో విషయంలో ఇబ్బంది పడతారు. ఆర్థికంగా బలపడతారు.



మిథునం
దీర్ఘకాలిక అనారోగ్యం కారణంగా బలహీనంగా అనిపిస్తుంది. చక్కగా ఆకట్టుకునేలా మాట్లాడండి. కార్యాలయంలో ఉద్యోగుల మధ్య పోటీ ఉంటుంది. రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లకు సంబంధించిన వ్యక్తులకు ఈ రోజు మంచిది. అత్తమామలు వైపు కొంచెం అసంతృప్తిగా ఉంటారు.



కర్కాటకం
కార్యాలయంలో టెన్షన్లు పెరుగుతాయి. స్నేహితుల నుంచి ప్రయోజనం పొందుతారు. మీకు జ్ఞానోదయం చేసే వ్యక్తులతో మీ పరిచయాలు బలపడతాయి. పని అంకితభావంతో చేస్తారు. ప్రేమ వ్యవహారాల విషయంలో చాలా టెన్షన్ పడతారు.



సింహం
పెట్టుబడి లాభదాయకంగా ఉంటుంది. మీ సమర్థత పెరుగుతుంది. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ముందుకు తీసుకెళ్లేందుకు ఇదే మంచి సమయం. వ్యాపార విషయాల్లో సయోధ్య కుదురుతుంది. ఆర్థికపరిస్థితి బావుంటుంది. శత్రువులు యాక్టివ్ గా ఉంటారు.



కన్యా
ఈ రోజు ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఎవరితోనైనా విభేదాలు రావొచ్చు. విద్యార్థులు చదువు విషయంలో ఆందోళన చెందుతారు. ప్రేమ సంబంధాల్లో వివాదాలు రావొచ్చు. మీ తప్పుల వల్ల మీ సహోద్యోగులు ఇబ్బందుల్లో పడతారు.



తులా
మీరు ఉద్యోగం గురించి ఆందోళన చెందుతారు. ఆర్థిక సమస్య తీరుతుంది. జీవిత భాగస్వామితో సఖ్యత ఉంటుంది. కుటుంబ సభ్యుల మనోభావాలను గౌరవించండి. బిజీ బిజీగా ఉంటారు. పని పట్ల క్రమశిక్షణతో ఉండండి. ఇంట్లో క్రమశిక్షణ పాటించాలి.



వృశ్చికం
ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఈ రోజంతా మీ సమయాన్ని సరదాగా గడుపుతారు. కొన్ని ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందుతారు. మీకు గౌరవం పెరుగుతుంది. రచనలవైపు మొగ్గు చూపవచ్చు. ప్రేమికులు పెళ్లి చేసుకునేదిశగా అడుగు వేయవచ్చు.



ధనుస్సు
ఈ రోజు స్నేహితులని కలుస్తారు. అప్పిచ్చిన మొత్తాన్ని తిరిగి పొందొచ్చు. వ్యాపారంలో అవసరమైన ఒప్పందాలను పూర్తి చేయగలుగుతారు. కొన్ని విమర్శలు ఎదుర్కొంటారు. వివాదాలకు దూరంగా ఉండండి. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.



మకరం
వృద్ధుల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేయవద్దు. స్నేహితులతో కలిసి పార్టీ ఏర్పాటు చేస్తారు.న్యాయపరమైన విషయాలు పరిష్కారమవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. కుటుంబంలో కొన్ని ఇబ్బందులుంటాయి. పెద్దల ఆశీస్సులు పొందుతారు.



కుంభం
ఈ రోజు సాధారణంగా ఉంటుంది. శని అనుగ్రహం వల్ల మీ సమస్య తీరుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం కష్టమవుతుంది. పిల్లలతో సంతోషంగా గడపుతారు. ఎవరితోనైనా వివాదాలు వచ్చే అవకాశం ఉంది.



మీనం
మీనం
ఈ రోజు గందరగోళం తొలగిపోతుంది. ప్రేమికులకు మంచి రోజు.ఎప్పటి నుంచో నిలిచిపోయిన ప్రాజెక్టులను ప్రారంభించవచ్చు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తిచేయగలుగుతారు. విమర్శలకు భయపడవద్దు.