ఇంట్లో చేసే పూజల సమయంలో అయినా ఆలయంలో అయినా కానీ స్టీలు పాత్రల వినియోగం తక్కువే కనిపిస్తుంది
పూజకు ముఖ్యంగా వినియోగించే పంచపాత్రలన్నీ రాగివే ఉంటాయి
పూజల్లో స్టీలు సామాన్లు వినియోగించవచ్చా అనే సందేహం చాలామందిలో ఉంటుంది
స్టీలు సామాన్లు వాడకం ఆరోగ్యపరంగాను, ఆధ్యాత్మిక పరంగానూ అంత మంచిదికాదంటారు పండితులు
స్తోమత వుంటే వెండి – బంగారం, లేదంటే ఇత్తడి – రాగి పాత్రలను వాడటమే అన్ని విధాలా మంచిదని చెబుతోంది శాస్త్రం
స్టీలు ( ఇనుము) శని సంబంధమైన లోహం కనుక ఆధ్యాత్మిక పరంగా వినియోగించవద్దంటారు
స్టీలుకి బదులు పూజకు మట్టిపాత్రలు వినియోగించినా శ్రష్టమే అని పండితులు చెబుతారు
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు.