మిరియాల పొడిని గోరువెచ్చని నీటితో కలిపి పేస్ట్ లా చేసి జుట్టు కుదుళ్లకు పట్టించి 15 ని. తర్వాత కడిగెయ్యాలి.

దీనిలోని ఖనిజ లవణాలు, విటమిన్లు జుట్టుకు పోషణను ఇస్తాయి.

దాల్చిన చెక్క పొడి తేనే కలిపి జుట్టుకు మాస్క్ లా వేసుకని 20 నిమిషాలకు కడిగెస్తే జుట్టు రాలదు.

దాల్చిన చెక్కలోని యాంటీమైక్రోబయల్, యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు చుండ్రుకు మంచి పరిష్కారం.

రాత్రంతా నానబెట్టిన మెంతులను పేస్ట్ చేసి దాన్ని మాడుకు పట్టించి 30 ని. తర్వాత కడిగేస్తే జుట్టు పట్టుకుచ్చులా అవుతుంది.

మెంతుల్లో నికోటినిక్ ఆసిడ్, ప్రొటీన్ వంటి పోషకాలు పుష్కలం. ఇవి జుట్టు పెరిగేందుకు దోహదం చేస్తాయి.

పెరుగు పసుపు కలిపి తలకు పెట్టుకుని 20 నిమిషాల తర్వాత కడిగేస్తే స్కాల్స్ ఆరోగ్యంగా ఉంటుంది.

నువ్వుల నూనెతో తలకు మసాజ్ చేస్తే జుట్టు పొడవుగా అందంగా పెరుగుతుంది.

నువ్వుల్లో ఒమెగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ ఉంటాయి. తలలో రక్త ప్రసరణ మెరుగై జుట్టు పెరిగేందుకు దోహదం చేస్తుంది.

Representational Image : Pexels