'బిగ్ బాస్ 5' విజేత సన్నీ హీరోగా నటించిన సినిమా 'సౌండ్ పార్టీ'. ఇందులో ఎవరెవరు నటించారు? కాస్ట్ అండ్ క్రూ డీటెయిల్స్... వీజే సన్నీ సరసన ఆమని మేనకోడలు హృతికా శ్రీనివాస్ కథానాయికగా నటించారు. హీరో తండ్రి పాత్రలో 'అమృతం' సీరియల్, ఎన్నో సినిమాలు చేసిన శివన్నారాయణ నటించారు. '30' ఇయర్స్ పృథ్వీ, 'మిర్చి' ప్రియ, మాణిక్ రెడ్డి, అశోక్ కుమార్, కాదంబరి కిరణ్ ప్రధాన తారాగణం జయశంకర్ సమర్పణలో సంజయ్ శేరి దర్శకత్వం వహించారు. 'జెమిని' సురేష్, భువన్ సాలూరు, అంజలి, ఇంటూరి వాసు, చలాకి చంటి, ప్రేమ్ సాగర్, హేమంత్ నటించారు. 'సౌండ్ పార్టీ' చిత్రాన్ని రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర నిర్మించారు. శ్రీ శ్యామ్ గజేంద్ర పార్ట్నర్ మోహిత్ రెహమానిక్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ సినిమాలో పాటల్ని పూర్ణాచారి రాశారు. (all images courtesy : sound party movie team)