చలికాలం వచ్చిందంటే.. జలుబు మాత్రమే కాదు, తమ్ములు కూడా గట్టిగానే వస్తాయి. కొందరికైతే తీవ్రంగా గొంతు నొప్పి వస్తుంది. దానివల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది. చికాకు కలిగించే గొంతు నొప్పి నుంచి బయటపడేందుకు కొన్ని చిట్కాలున్నాయి. పుదీనాలో ఉండే మెంథాల్ అనే సమ్మేళనం గొంతు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. గోరువెచ్చని నీటిలో కాస్త తేనె, నిమ్మరసం, కాస్త అల్లం కలిపి తాగితే రిలీఫ్ ఉంటుంది. అవేవీ అందుబాటులో లేకపోతే రోజుకు రెండు సార్లు ఉప్పు నీటిని పుక్కిలించండి. అల్లం టీ కూడా గొంతు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. Images Credit: Pexels