ఫ్యాషన్, స్టైల్స్ విషయంలో మిగతా హీరోయిన్ల కంటే ఓ అడుగు ముందు ఉండే బాలీవుడ్ భామ సోనమ్ కపూర్.

బాలీవుడ్ ప్రేక్షకులు సోనమ్ కపూర్ ను ముద్దగా ఫ్యాషనిస్టా అంటారు. ఫ్యాషన్ ఐకాన్ అని కొందరు బిరుదు ఇచ్చారు. 

స్టైల్ గేమ్ విషయానికి వచ్చేసరికి సోనమ్ కపూర్ ఎప్పుడూ తగ్గేది లే అన్నట్టు ఉంటారు. 

సోనమ్ కపూర్ మిడి డ్రస్ ధరించి లేటెస్టుగా ఫోటోషూట్ చేశారు. బుధవారం ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. 

మామూలుగా మిడి డ్రస్ వేస్తే సోనమ్ స్పెషాలిటీ ఏముంటుంది? cynotype ప్రింటెడ్ డ్రస్ ఆమె ధరించారు. 

cynotype అంటే ఫోటోలలో డ్రస్ మరింత అందంగా కనిపిస్తుంది. అమ్మాయిల అందాన్ని రెట్టింపు చేస్తుంది. 

డ్రస్ బావుంది కదా! మీరు కూడా ఒకటి కొనాలని ప్లాన్ చేస్తున్నారా? మరి, దాని రేటు ఎంతో తెలుసా?

సోనమ్ కపూర్ ధరించిన ఈ డ్రస్ ధర రూ. 18,000 మాత్రమే. అవును... మీరు చదివింది నిజమే. 

గతేడాది సోనమ్ కపూర్ 'బ్లైండ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రజెంట్ కొన్ని కథలు వింటున్నారు. 

సోనమ్ కపూర్ (all images courtesy : sonamkapoor / instagram)