బాదాములలో విటమిన్ ఇ, ఒమెగా3 ఫ్యాటీ ఆసిడ్స్, ప్రొటీన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్ ఉంటాయి.

వీటితో రకరకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

జీర్ణశక్తి పెంపొందుతుంది. రక్త ప్రసరణ మెరుగవుతుంది, బీపి అదుపులో ఉంటుంది. త్వరగా వయసు ప్రభావం కనిపించదు.

ప్రతి రోజూ బాదం పప్పులను ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు.

అయితే ఇవి నానబెట్టి తినాలా? లేదా నేరుగా తినొచ్చా అనే సందేహం చాలామందిలో ఉంది.

బాదం గింజలపై ఉండే తొక్క పోషకాల శోషణకు అడ్డుతగులుతుంది. కనుక రాత్రంతా నానబెట్టి పొట్టు తీసి తింటే మంచిది.

అయితే, నానబెట్టిన బాదములు కొన్ని పోషకాలు నష్టపోతాయి. పొడి బాదాముల నుంచి అన్ని పోషకాలు లభిస్తాయి.

తొక్కతో ఉన్న బాదాములు జీర్ణం కావడం కొంచెం కష్టం. నానబెబ్టిన బాదాముల నుంచి తొక్క తొలగించడం సులభం.

నానబెట్టినా లేక నానబెట్టకపోయినా బాదాములు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

ఏరకంగా తిన్నా సరే గుప్పెడు బాదాములు రోజూ తీసుకోవడం మంచిది.
Images courtesy : Pexels