కొన్ని రకాల పండ్లు ఉదయాన్నే పరగడుపున తింటే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అవేమిటో చూద్దాం. అరటి పండులో పోషకాలు పుష్కలం. తక్షణ శక్తికి అరటిపండు తింటే చాలు. పరగడుపున తినేందుకు చాలా మంచి పండుగా చెప్పుకోవచ్చు. వాటర్ మిలన్ నిండా నీళ్లుంటాయి. పుచ్చకాయ శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. దీనితో రోజు ప్రారంభిస్తే రిఫ్రెషింగ్ ఫీల్ ఉంటుంది. బొప్పాయిలో ఉండే పెపెయిన్ జీర్ణశక్తిని పెంచుతుంది. బొప్పాయిలో క్యాలరీలు తక్కువ. ఫైబర్ ఎక్కువ. కడుపు నిండుగా ఉండే భావన కలిగిస్తుంది. కివి ఇమ్యూనిటి పెంపొందిస్తుంది. శరీరంలో కొల్లాజెన్ ప్రొడక్షన్ కు అవసరం. ఫైబర్ జీర్ణవ్యవస్థకు మంచిది. ఇందులోని పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఆపిల్ లో ఫైబర్ ఎక్కువ. ఆపిల్ లో ఉండే సహజమైన చక్కెరలు శక్తిని స్థిరంగా విడుదల చేస్తాయి. దీనిలో ఫైబర్ జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పరుస్తుంది. Image courtecy : Pexels