గురక తగ్గించుకోకపోతే ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం ఎక్కువగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.



ది బెటర్ స్లీప్ క్లినిక్ నిపుణులు చెప్పిన దాని ప్రకారం కొంతమంది
నిద్రపోతున్నప్పుడు గంటకు 60 సార్లు శ్వాస తీసుకోవడం ఆపేస్తారు.


పగటి పూట బాగా అలిసిపోయినప్పుడు గురక పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది.



గురక ఉంటే కరొనరీ హార్ట్ డీసీజ్, డిప్రెషన్, స్ట్రోక్, గుండె ఆగిపోయే ప్రమాదం 140 శాతం ఎక్కువగా ఉంటుంది.



ఇది టైప్ 2 డయాబెటిస్ కు కూడా దారి తీస్తుంది. మరి కొంతమందికి అయితే చిత్త వైకల్యం ముందుగానే రావచ్చు.



స్లీప్ అప్నియా పరిస్థితిలో వాయు ప్రసరణ పరిమితం అవుతుంది.
లేదా ఒక్కొక్కసారి వాయు మార్గంపూర్తిగా మూసుకుపోతుంది.


ఊబకాయం, మద్యపానం, ధూమపానం, థైరాయిడ్ తక్కువగా
ఉండటం వంటి సమస్యలు ఈ ప్రమాదాన్ని మరింత పెంచుతాయి.


గురక పరిస్థితిని తగ్గించేందుకు CPAP ట్రీట్మెంట్ ఇస్తున్నారు.
ఒక యంత్రాన్ని ఉపయోగించి బాధితులకు చికిత్స చేయడం జరుగుతుంది.


పెద్దగా గురక పెట్టడం, నోరు పొడిబారిపోవడం, తలనొప్పితో లేవడం వంటి సంకేతాలు స్లీప్ అప్నియా లక్షణాలు.
Images Credit: Pexels/Pixabay