స్మార్ట్ ఫోన్ లైఫ్ ఎక్కువ కాలం ఉండాలంటే కేర్ తీసుకోవడం కంపల్సరీ. స్క్రీన్, ఛార్జింగ్ పాయింట్‌ను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. ఫోన్‌ను క్లీన్ చేసేటప్పుడు రఫ్‌గా కాకుండా స్మూత్‌గా ఉండే క్లాత్ ఉపయోగించాలి. ఛార్జింగ్ సాకెట్‌ను క్లీన్ చేసేటప్పుడు దూదితో చేయడం ఉత్తమం. స్మార్ట్ ఫోన్ లైఫ్‌ను బ్యాటరీ కూడా నిర్ణయిస్తుంది. కాబట్టి ఛార్జింగ్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు కాల్ మాట్లాడటం, మ్యూజిక్ వినడం, గేమ్స్ ఆడటం వంటివి చేయకూడదు. అసలు ఉపయోగించకుండా ఉంటే చాలా ఉత్తమం. కొంతమంది ఫోన్‌ను రాత్రంతా ఛార్జింగ్ పెడతారు. అది కూడా మంచిది కాదు. ఫోన్‌లో ఎక్కువ యాప్స్ ఉండటం కారణంగా స్లో అయిపోతుంది. కాబట్టి అవసరం అయినవి ఉంచుకోవడం బెస్ట్. ఛార్జింగ్ పెట్టేటప్పుడు కంపెనీ ఛార్జర్ మాత్రమే ఉపయోగించాలి.