యాక్టివ్‌గా లేని ఖాతాలను గూగుల్ డిలీట్ చేయడం ప్రారంభించింది. ఏళ్లుగా వినియోగంలో లేని ఖాతాలను గూగుల్ డిలీట్ చేయనుంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా గతేడాది మేలో ప్రకటించింది. గూగుల్ ఖాతాలతో పాటు వాటి డేటా కూడా డిలీట్ అయిపోతుంది. రెండు సంవత్సరాల పాటు యాక్టివ్‌గా లేని ఖాతాలు డిలీట్ అయిపోతాయి. మీ అకౌంట్ యాక్టివ్‌గా ఉండాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వండి. మీ ఖాతా నుంచి ఏదో ఒక మెయిల్ పంపినా యాక్టివ్‌గా ఉన్నట్లే. గూగుల్ డ్రైవ్‌కు కంటెంట్ కూడా అప్‌లోడ్ చేయవచ్చు. అలాగే యూట్యూబ్‌లో వీడియోలు కూడా చూడవచ్చు. ప్లేస్టోర్ నుంచి యాప్స్ డౌన్‌లోడ్ చేసినా, గూగుల్ ఫొటోలకు ఫొటోస్ అప్‌లోడ్ చేసినా మీ ఖాతా సేఫ్ అన్నమాట.