మనలో చాలా మంది రోజూ సోషల్ మీడియా చూస్తూనే ఉంటారు. కొంతమంది అదే పనిగా గంటలు గంటలు సోషల్ మీడియాలో గడిపేస్తారు. ప్రపంచంలోనే అత్యధికంగా ఏ దేశంలో సోషల్ మీడియా ఎక్కువ సేపు ఉంటారో తెలుసా? ఫిలిప్పీన్స్ ప్రజలు ఎక్కువ సేపు సోషల్ మీడియాలో గడుపుతున్నారు. ఫిలిప్పీన్స్‌లో సగటు సోషల్ మీడియా వాడక సమయం నాలుగు గంటల ఆరు నిమిషాలుగా ఉంది. అంటే ఒక వ్యక్తి రోజుకు సగటున నాలుగు గంటల ఆరు నిమిషాలు సోషల్ మీడియాలో గడుపుతున్నారన్న మాట. భారతదేశంలో సగటున ఎంత సేపు సోషల్ మీడియాలో గడుపుతున్నారో తెలుసా? మనదేశంలో కూడా సోషల్ మీడియాను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. సగటున ఒక భారతీయుడు రోజుకు రెండు గంటల 36 నిమిషాలు వాడుతున్నారు. ప్రపంచంలోనే మనదేశం 14వ స్థానంలో ఉంది.