ఒక నంబర్ వేరే వారికి ఇచ్చేముందు టెలికాం కంపెనీలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాయి. మీ నంబర్ 60 రోజుల పాటు రీఛార్జ్ చేయకపోతే మీ చేయి జారిపోయే అవకాశం ఉంటుంది. మొదట మీ నంబర్ డీయాక్టివేట్ అవుతుంది. ఆ తర్వాత మీకు ఆరు నుంచి తొమ్మిది నెలల వరకు సమయం ఉంటుంది. ఈ గ్యాప్‌లో మీరు మీ నంబర్ ఒక్కసారి అయినా రీఛార్జ్ చేయాలి. ఈ లోపు మీకు కంపెనీ నుంచి ఎన్నో వార్నింగ్స్ కూడా వచ్చి ఉంటాయి. ఒకవేళ ఈ నంబర్ మీరు ఉపయోగిస్తూ ఉండే కనీసం ఒక్కసారి అయినా రీఛార్జ్ చేయాలి. ఆ తర్వాత కొన్ని నెలలకు ఆ నంబర్‌ను వేరే వారికి కేటాయిస్తారు. ఈ ప్రాసెస్ అంతా పూర్తయ్యేసరికి కనీసం ఒక సంవత్సరం పైగా సమయం పడుతుంది. కాబట్టి నంబర్ రీఛార్జ్ చేయకుండా ఉపయోగించేటప్పుడు కాస్త చూసుకోండి.