ఐఫోన్ 15 తర్వాత ఐఫోన్ 16 సిరీస్‌ను లాంచ్ చేయడానికి కంపెనీ సిద్ధం అవుతోంది. ఐఫోన్ 16 లైనప్‌కు సంబంధించి లీకులు కూడా వస్తున్నాయి. ఐఫోన్ 15 సిరీస్‌తో పోలిస్తే ఈసారి చాలా మార్పులు చేయనున్నారట. ర్యామ్, స్క్రీన్ సైజు, కెమెరా ఇలా అన్నిటినీ అప్‌గ్రేడ్ చేయనున్నారు. ఐఫోన్ 16, 16 ప్లస్‌ల్లో 8 జీబీ ర్యామ్‌ను అందిస్తారని యాపిల్ అనలిస్టులు పేర్కొంటున్నారు. ఐఫోన్ 15, 15 ప్లస్‌ల్లో 6 జీబీ వరకు ర్యామ్ ఉంది. ఐఫోన్ 16, 16 ప్లస్‌ల్లో వైఫై 6ఈ సపోర్ట్ ఉండనుందట. వైఫై 6 కంటే ఎక్కువ వేగంలో వైఫై 6ఈలో ఇంటర్నెట్ అందుబాటులో ఉండనుంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ ఎక్స్75 5జీ మోడెం అందుబాటులో ఉంది. 15 సిరీస్‌లో ఎక్స్70 5జీ మోడెం అందించారు. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌లో 6.9 అంగుళాల డిస్‌ప్లే ఉండనుందని సమాచారం.