జుట్టు, చర్మ సంరక్షణ కోసం కొత్త ప్రొడక్ట్స్ వెతుకుతున్నారా? అయితే మన బాలీవుడ్ ముద్దుగుమ్మల సొంత ప్రొడక్ట్స్ ట్రై చేసి చూడండి.



గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా 'అనోమలీ'



ఇదొక హెయిర్ కేర్ బ్రాండ్. శాఖాహార ఉత్పత్తులతో తయారు చేశారు. అంతే కాదు రీసైకబుల్ ప్లాస్టిక్ బాటిల్ వినియోగిస్తారు.
పర్యావరణానికి ఎటువంటి హాని కలిగించదు.


దీపికా పదుకొణే 82 డిగ్రీ E



చర్మ సంరక్షణ కోసం 2022 లో దీపిక ఈ బ్రాండ్ స్టార్ట్ చేసింది. ప్రత్యేకమైన మూలికా పదార్థాలు ఉపయోగించి దీన్ని రూపొందించారు.



లీసా హేడెన్ నెక్డ్



నటి, మోడల్ లీసా హేడెన్ NAKED బ్రాండ్ 2013 లో తీసుకొచ్చింది. ప్రిజర్వేటివ్స్ లేని ప్రొడక్ట్ ఇది.



కృతి సనన్ హైఫన్



కృతి తన 33 వ పుట్టినరోజు సందర్భంగా తన ప్రీమియం స్కిన్ కేర్ బ్రాండ్ హైఫన్ ని తీసుకొచ్చింది.
ఇది కూడా వీగన్ ప్రొడక్ట్.


బ్రౌన్ స్కిన్ అనుష్క దండేకర్



బ్రౌన్ స్కిన్ బ్యూటీ అనేది బ్రౌన్ స్కిన్ వాళ్ళ కోసం ప్రత్యేకంగా రూపొందించారు.
పర్యావరణ అనుకూలమైన ఉత్పత్తులతో దీన్ని తయారు చేశారు.


లారా దత్తా భూపతి అరియాస్



ఇది కూడా శాఖాహార ప్రొడక్ట్. 2019 లో లారా దత్తా ప్రవేశపెట్టారు. చర్మం సంరక్షణ బ్రాండ్.
టోనర్ నుంచి ఫేస్ మాస్క్ వరకు అరియాస్ అందిస్తుంది.