గర్భిణులకు డెంగ్యూ వస్తే చాలా డేంజర్ దోమల ద్వారా వ్యాపించే డెంగ్యూ ఎక్కువగా పేద ప్రజల్ని టార్గెట్ చేస్తోంది. ఎందుకంటే వారి చుట్టూ అపరిశుభ్రమైన వాతావరణమే అధికంగా ఉంటుంది. డెంగ్యూ గర్భిణీ స్త్రీలకు వస్తే మాత్రం ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. దీనివల్ల ప్రసవం ముందుగా కావడం లేదా బిడ్డ గర్భంలోనే మరణించడం వంటి సమస్యలు వస్తాయి. గర్భధారణ సమయంలో రోగనిరోధక వ్యవస్థ చాలా బలహీనంగా మారుతుంది. దీనివల్ల గర్భిణీలు డెంగ్యూ వంటి ఇన్ఫెక్షన్లకు త్వరగా లోనవుతారు. గర్భధారణ సమయంలో హార్మోన్లు కూడా మార్పులు అధికంగా చెందుతాయి. దీనివల్ల వ్యాధులు సులభంగా సోకుతాయి. గర్భధారణ సమయంలో డెంగ్యూ ఇన్ఫెక్షన్ తల్లీ బిడ్డ ఇద్దరికీ సోకే అవకాశం ఉంది. దీనివల్ల బిడ్డ చాలా ప్రభావితం అవుతుంది. గర్భిణీలు ముందుగానే డెంగ్యూ రాకుండా జాగ్రత్తపడాలి. ఇంటి చుట్టూ నీరు నిలవకుండా చూసుకోవాలి. శరీరమంతా కప్పేలా దుస్తులు వేసుకోవాలి. దోమతెరలను వినియోగిస్తూ ఉండాలి.