మీకు ఈ సమస్యలు ఉంటే వీటిని తినకండి



వేరుశెనగ పలుకులు తింటే ఆరోగ్యానికి మంచిది. కానీ కొన్ని ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం వీటిని తినకూడదు.



కొన్ని ఆరోగ్య పరిస్థితుల్లో వీటిని అధికంగా తినడం వల్ల అనారోగ్యం ఇంకా పెరుగుతుంది.



చర్మ సమస్య అయిన ఎగ్జిమా ఉన్న వారు వేరుశెనగ పలుకులను దూరం పెట్టాలి.



మధుమేహం ఉన్న వారు వీటికి దూరంగా ఉండడం ఉత్తమం.



కొందరికి వేరుశెనగ పలుకుల వల్ల అలెర్జీ వచ్చే అవకాశం ఉంది. వారు వీటిని తినకూడదు.



అధిక బరువుతో బాధపడేవారు కూడా వీటిని దూరంపెట్టాలి. వీటిలో క్యాలరీలు అధికంగా ఉంటాయి.



గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్న వారు కూడా ఈ వేరుశెనగకు దూరంగా ఉండడం ఉత్తమం.



జీవక్రియ సమస్యలు ఉన్న వారు కూడా వీటిని తినకూడదు.