మైదా పిండిని తెల్లటి విషం అంటారు ఎందుకంటే... మైదా అంటే బాగా శుద్ధి చేసిన తెల్లటి పిండి. ఈ పిండితో చేసిన వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. మైదా పిండిని ఆరోగ్య నిపుణులు మాత్రం వైట్ పాయిజన్ అని పిలుస్తారు. మైదా చరిత్ర 32 వేల క్రితం నాటిది. ఇటాలియన్లు తొలిసారిగా ఈ పిండిని తయారు చేశారని అంటారు. మైదాను చాలా ప్రాసెస్ చేసి తయారు చేస్తారు. అందుకే ఇది గోధుమలతో తయారైనప్పటికీ చాలా తెల్లటి రంగులో ఉంటుంది. మైదాకు ఇలాంటి తెల్లటి రంగును, మెత్తటి రూపాన్ని ఇవ్వడం కోసం దానిలో బెంజాయిల్ పెరాక్సైడ్ వంటి రసాయనాలను కలుపుతారు. అలాగే అలోక్సాన్ అనే మరో రసాయనం కూడా కలిపి మైదా మరింత మెత్తగా వచ్చేలా చేస్తారు. బెంజాయిల్ పెరాక్సైడ్ అనే రసాయనాన్ని హెయిర్ డైలలో వాడుతూ ఉంటారు. వీటిని మనం తినడం వల్ల భవిష్యత్తులో ఎన్నో రకాల అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది. అందుకే మైదాను తెల్లటి విషమని పిలుస్తారు.