కదలకుండా కూర్చుంటే ప్యాకెట్ సిగరెట్లు కాల్చినట్టే ఉద్యోగంలో భాగంగా ఆఫీసులో ఎక్కువసేపు కదలకుండా కూర్చునే వారి సంఖ్య అధికంగా ఉంది. నిజానికి రెండు గంటల పాటు కదలకుండా కూర్చోవడమే శరీరానికి ఎంతో హానికరం. ఇది ఒక ప్యాకెట్ సిగరెట్స్ తాగడంతో సమానమని చెప్పుకోవచ్చు. ప్యాకెట్ సిగరెట్లు తాగితే శరీరానికి ఎంత హాని జరుగుతుందో, రెండు గంటల పాటు కదలకుండా కూర్చోవడం వల్ల కూడా అంతే హాని జరుగుతుంది. దీర్ఘకాలంగా ఇలా కూర్చోవడం వల్ల హైబీపీ త్వరగా వచ్చేస్తుంది. అలాగే కార్డియోవాస్కులర్ జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ సమయం కదలకుండా కూర్చుంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. బరువు కూడా పెరుగుతారు. ఎక్కువసేపు కూర్చునే వారిలో నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువసేపు కూర్చుంటే ఊపిరితిత్తులు, పెద్ద పేగు, గర్భాశయం క్యాన్సర్లు వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. వీలైతే ప్రతి గంటకు ఒకసారి లేచి ఇటూ అటూ నడుస్తూ ఉండండి. కాళ్ళు చేతులు కదిలిస్తూ ఉండండి.