టాలీవుడ్ సీతా మహాలక్ష్మి మృణాల్ ఠాకూర్ తన లేటెస్ట్ ఫొటోలతో నెట్టింట హల్ చల్ చేస్తోంది. గత కొన్ని రోజులుగా ఆస్ట్రేలియాలో సందడి చేస్తున్న ఈ బ్యూటీ.. సోమవారం ఇండియాకి తిరిగి వచ్చేసింది. వచ్చీ రాగానే బ్యాక్ టూ బాంబే అంటూ అమ్మడు కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. లైట్ బ్లూ కలర్ డ్రెస్సులో చిరునవ్వులు చిందిస్తున్న మృణాల్ అందాలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. 'సీతా రామం' సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో పెట్టింది ఈ ముద్దుగుమ్మ. సీతా మహాలక్ష్మిగా, ప్రిన్సెస్ నూర్జహాన్ గా యువ హృదయాలను కొల్లగొట్టింది. ఎంట్రీతోనే తెలుగులో బ్లాక్ బస్టర్ సక్సెస్ రుచి చూసిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తోంది. ఇటీవల ‘ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్'లో 'డైవర్సిటీ ఇన్ సినిమా' అవార్డ్ అందుకుంది మృణాల్. ప్రతిష్టాత్మక IIFM అవార్డు సాధించినందుకు అందాల భామ సంతోషం వ్యక్తం చేసింది. నానికి జోడీగా మృణాల్ నటిస్తున్న 'హాయ్ నాన్న' చిత్రం ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది.