'నా దేశం' నుంచి 'ఆర్ ఆర్ ఆర్' వరకు - టాలీవుడ్ బెస్ట్ 10 దేశభక్తి సినిమాలు! 1. అల్లూరి సీతారామరాజు : మన్యం వీరుడు అల్లూరి జీవిత కథ ఆధారంగా సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అయింది. 2. నా దేశం(1982): సీనియర్ ఎన్టీఆర్ హీరోగా సమాజంలో ఉన్న రాజకీయ, సామాజిక లోపాలను చూపించారు. 3. బొబ్బిలి పులి (1982) : ఎన్టీఆర్ నటించిన మరొక దేశభక్తి చిత్రం.ఇందులో న్యాయవ్యవస్థలో ఉన్న లోపాలను ఎత్తి చూపారు. 4. నేటి భారతం (1983): సుమన్, విజయశాంతి నటించిన ఈ సినిమా సామాజిక దురాగతాలను ఎండగడుతూ ప్రజల్లో స్ఫూర్తి నింపేలా ఉంటుంది. 5. భారతీయుడు (1996): కమలహాసన్ సమాజంలో కూరుకుపోయిన లంచగొండితనంపై పోరాటం చేయడాన్ని ఇందులో చూపించారు. 6. ఖడ్గం (2002): శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో హిందూ, ముస్లిం గురించి చక్కటి సందేశాన్ని ఇచ్చిన సినిమా. 7. సుభాష్ చంద్రబోస్ (2005): వెంకటేష్ హీరోగా సోషియో ఫాంటసీ జోనర్ లో రూపొందిన ఈ చిత్రం కమర్షియల్ గా ఆడలేదు. 8. పరమవీరచక్ర (2011) : బాలయ్య, దాసరి నారాయణరావు కాంబినేషన్లో వచ్చిన దేశభక్తి చిత్రం సక్సెస్ కాలేదు. 9. సైరా నరసింహా రెడ్డి(2019): చిరంజీవి హీరోగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథను వెండితెరపై అద్భుతంగా చూపించారు. 10. RRR (2022): ఎన్టీఆర్, రామ్ చరణ్ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలా పోరాడారో అద్భుతంగా చూపించారు.